calender_icon.png 21 December, 2024 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పోర్ట్స్ డ్రామాగా పతంగ్

16-10-2024 12:00:00 AM

తెలుగు తెరపై స్పోర్ట్స్ డ్రామాలు చాలా వచ్చాయి కానీ అవన్నీ క్రికెట్, వాలీబాల్, కబడ్డీ వంటి క్రీడలకు సంబంధించినవి. గాలిపటాలకు సంబంధించిన పోటీ అనేది సంక్రాంతి సమయంలో సరదాగా సాగుతుంది. ఒకరి మాంజా తెంపేస్తే మరొకరికి ఆనందం. ఈ పతంగుల పోటీని కథాంశంగా తీసుకుని తెరకెక్కుతున్న చిత్రమే ‘పతంగ్’.

ఈ చిత్రంలో జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్, ఇన్‌స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల హీరోహీరోయిన్లుగా పరిచయం కాబోతున్నారు. వంశీ పూజిత్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

సిని మాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్ర విడుదల తేదీని మంగళవారం ప్రకటించారు. డిసెంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.