calender_icon.png 27 November, 2024 | 7:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక పటాన్చెరు

06-11-2024 12:01:08 PM

ఛట్ పూజ సందర్భంగా 20 వేల మంది ఉత్తర భారతీయులకు ఏడు లారీల చెరుకు పంపిణీ 

పటాన్చెరు (విజయక్రాంతి): భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా పటాన్చెరు నియోజకవర్గం నిలుస్తోందని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఉత్తర భారతీయులు ప్రతి ఏటా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుని ఛట్ పూజ పురస్కరించుకొని పటాన్చెరు డివిజన్ పరిధిలోని తన నివాసంలో నియోజకవర్గ పరిధిలోని పటాన్చెరు, ఇస్నాపూర్, పాశమైలారం, బొల్లారం, రామచంద్రాపురం, అమీన్పూర్, గుమ్మడిదల ప్రాంతాలలో నివసిస్తున్న 20 వేల మంది ఉత్తర భారతీయులకు ఏడు లారీల చెరుకును సొంత నిధులతో కొనుగోలు చేసి ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఉపాధి కోసం పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ పరిశ్రమలలో పనిచేస్తూ స్థానికంగా నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరి సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో సైతం తగు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. గత 20 సంవత్సరాలుగా పటాన్చెరువు సాకి చెరువు కట్ట పైన ఛట్ పూజ కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ వారికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.