20-03-2025 02:19:47 PM
పటాన్ చెరు,(విజయక్రాంతి): ఆపత్కాలంలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం(Corporate medicine) అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(Patancheru MLA Gudem Mahipal Reddy) తెలిపారు. పటాన్ చెరు డివిజన్ కి చెందిన సన్నీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు మంజూరైన లక్ష రూపాయల విలువైన ఎల్ఓసి నీ సన్నీ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందచేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, గుమ్మడిదల మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్, విజయ్ భాస్కర్ రెడ్డి, షేక్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.