21-03-2025 10:42:11 PM
పాల్గొన్న కాట శ్రీనివాస్ గౌడ్
పటాన్ చెరు: రామచంద్రాపురం ఈద్గా వద్ద శుక్రవారం ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఇఫ్తార్ విందును 112 డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఈశ్వర్ సింగ్, నాయకులు నరేష్ ముదిరాజ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఉపవాస దీక్షలు విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, స్థానిక ప్రముఖులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు