08-04-2025 12:00:00 AM
రూ.10 కోట్ల 78 లక్షలతో తిమ్మక్క చెరువు, ముత్తంగి ఎంక చెరువుల అభివృద్ధి
సుందరీకరణ పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, ఏప్రిల్ 7 : పటాన్ చెరు డివిజన్ పరిధిలోని తిమ్మక్క చెరువు, తెల్లాపూర్ మున్సిపల్ ముత్తంగి గ్రామ పరిధిలోని ఎంక చెరువులను హెచ్‌ఎండిఏ ద్వారా రూ.10 కోట్ల 78 కోట్లతో పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి రెండు చెరువుల వద్ద సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్ చెరు, ముత్తంగి పరిధిలో ప్రజలకు ఆహ్లాద కేంద్రాలుగా ఉండేందుకు చెరువులను సుందరీకరణ చేపడుతున్నామని తెలిపారు.
ప్రతి చెరువు కట్ట పైన సెంట్రల్ లైటింగ్ సిస్టం, గ్రీనరీ, వాకింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకునేందుకు పార్క్, తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, హెచ్‌ఎండిఏ చెరువుల విభాగం డి ఈ రామకృష్ణ, ముత్తంగి మాజీ సర్పంచ్ ఉపేందర్, తెల్లాపూర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, కాంగ్రెస్ పార్టీ పటాన్ చెరు పట్టణ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కుమార్ గౌడ్, సిల్వేరి శ్రీనివాస్, మేరాజ్ ఖాన్, కిట్టు, రామకృష్ణ, యాదయ్య, ప్రభాకర్ గుప్తా, అశోక్, శ్రీనివాస్ రెడ్డి, అంజాద్ పాల్గొన్నారు.