12-02-2025 12:00:00 AM
ఐదో రోజు గరుడ సేవ, దివ్యవిమాన రథోత్సవం
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి) ః పాతగుట్ట శ్రీ లక్ష్మీనర సింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్స వాలు అత్యంత వైభవంగా జరుగుతున్నా యి. ఐదవ రోజైన మంగళవారం నాడు స్వామివారికి గరుడ వాహన సేవ అనం తరం దివ్య విమాన రథోత్సవాన్ని భక్తజను ల జై జై ధ్వనాల మధ్య అత్యంత భక్తిశ్రద్ధల తో వేద పండితులు ప్రధానార్చకులు, నిర్వహించారు. కార్యక్రమానికి ముందు స్వామివారి ఆలయంలో నిత్యారాధనలు పారాయణాలు.
చతుర్వేద పారాయణాలు. మూర్తి మంత్ర జపములు. శ్రీ లక్ష్మి అష్టోత్తర నామ జపములు నిర్వహించారు. శ్రీ స్వామివారి అమ్మవారుల కళ్యాణ ఉత్సవమూర్తులను అలంకరించి గరుడ వాహన సేవలు ఆలయ ప్రధాన అర్చకులు యజ్ఞాచార్యులు ఊరేగింపు సేవ నిర్వహిం చారు. గరుడ వాహనదారుడై భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ వాహన దారుడైన స్వామివారిని దర్శించిన జన్మ రాహిత్యము కలుగునని ఆర్యోక్తి. బ్రహ్మాది దేవతలతో పాటు సకల జీవరాశి దర్శించి తరించే గొప్ప వేడుక దివ్య విమాన రథోత్సవ వేడుక.
రథస్థమ కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతి అని లోక ప్రమాణము. రధా రూఢులైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోవడం మహా పుణ్యఫలం. రథోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాక భక్తజన హృదయాలలో తాత్విక బీజాలను పెంపొందించు ఒక యజ్ఞస్వరూపమని జన్మధా దుఃఖ రహితమని మోక్షమును కలిగించునని ఈ రథోత్సవ విశిష్టత తెలియ జేస్తుందని పండితులు వివరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
శ్రీరామ భక్త భజనమండలి, గాయత్రి భజన మం డలి వారు, జై శ్రీరామ మహిళా భజన మం డలి వారు భజన కార్యక్రమాలు నిర్వహిం చారు. హరీష్ డాన్స్ అకాడమీ వారు కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త బి నరసింహ మూర్తి, కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో భాస్కరరావు, ప్రధానార్చకులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.