calender_icon.png 6 February, 2025 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పాత జ్ఞానేశ్వరి

05-02-2025 10:48:10 PM

రెండవసారి అవకాశం కల్పించిన మహిళా కాంగ్రెస్..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పాక జ్ఞానేశ్వరినీ నియమిస్తూ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు బుధవారం నియామక పత్రాన్ని అందజేశారు. గతంలో కూడా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేసిన పాత జ్ఞానేశ్వరికి రెండోసారి కూడా జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పాత జ్ఞానేశ్వరికి అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తనపై నమ్మకంతో రెండోసారి కూడా జిల్లా అధ్యక్షురాలుగా నియమించిన ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో మహిళా కాంగ్రెస్ పార్టీకి కృషి చేస్తానని తెలిపారు. మండలాల వారీగా మహిళా కమిటీలను ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు.