calender_icon.png 3 April, 2025 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సికింద్రాబాద్‌లో ముగిసిన పాస్టర్ ప్రవీణ్ అంత్యక్రియలు

28-03-2025 12:09:21 AM

భారీగా తరలి వచ్చిన క్రైస్తవులు

దర్యాప్తు జరిపి, న్యాయం చేయాలని డిమాండ్

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 27(విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి సమీపంలో ఈ నెల 25న అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ప్రవీణ్ పగడాల అంత్యక్రియలు గురువారం ముగిశాయి. బుధ వారం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని సికింద్రాబాద్‌కు తీసుకువచ్చా రు. గురువారం ఉదయం నుంచి మధ్యా హ్నం వరకు ఆయన మృతదేహాన్ని సికింద్రాబాద్‌లోని సెంటినరీ బాప్టిస్టు చర్చిలో సంద ర్శనార్ధం ఉంచారు. ఆయనను చివరిసారి చూసేందుకు కుటుంబసభ్యులు, బంధువు లు, మిత్రులు, క్రైస్తవులు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు.

మాజీ ఎమ్మె ల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్, పాస్టర్లు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. సెయింటినరీ చర్చి నుంచి ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని మధ్యాహ్నం తర్వాత ప్రత్యేక వాహనంలో ఉంచి అంతిమయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవులు భారీ ర్యాలీగా పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. ఆయన మృతిపై విచారణ జరిపి, న్యాయం చేయాలని, నిందితులను శిక్షించాలని, నినాదాలు చేశారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ పక్కన గల సెయింట్ జాన్ స్మశాన వాటికలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంత్య క్రియలు నిర్వహించారు. నార్త్ జోన్ డీసీపీ రశ్మీపెరుమాల్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ర్యాలీలో పలుమార్లు పోలీసులు, ప్రవీణ్ అభిమానులకు మధ్య వాగ్వా దం జరిగింది. స్మశాన వాటికలోనికి వెళ్లకుండా గేట్లు వేసి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని పలువురు విమర్శించారు.