calender_icon.png 14 November, 2024 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2 వేల మంది పోలీసుల సాయంతో పాస్టర్ అరెస్ట్

10-09-2024 03:48:48 AM

  1. ఎట్టకేలకు పోలీసుల అదుపులో అరాచక పాస్టర్  
  2. ‘నా అరెస్ట్ వెనక దెయ్యం ఉంది’ అంటూ ఆరోపణ

మనీలా, సెప్టెంబర్ 9: ఫిలిప్పీన్స్ దేశంలో ప్రజలను మోసం చేస్తూ అరాచకాలకు పాల్పడిన పాస్టర్ అపోలోను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. కోర్టు ఆదేశాలతో  దాదాపు 2000 మంది పోలీసులను అతడి అరెస్ట్ సందర్భంగా వినియోగించారు. తాను విశ్వానికి యజమానిని అని ‘ది కింగ్‌డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్’ పేరుతో దాదాపు 75 ఎకరాల్లో ఓ మినీ సామ్రాజ్యాన్ని పాస్టర్  నిర్మించాడు. అపోలో అరెస్ట్ కోసం ఆశ్రమానికి వెళ్లినపుడు పాస్టర్ మద్దుతుదారులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో హెలికాప్టర్లను కూడా పోలీసులు వాడారు. ఈ ఆశ్రమంలో ఓ కాలేజీ, 75వేల సీట్ల కెపాసిటీగల ఓ స్టేడి యం, ప్రేయర్ హాల్‌తో పాటు దాదాపు 40 బిల్డింగ్‌లు ఉన్నాయి.

అపోలోకు  70 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కోర్టు ఆదేశాలతో పాస్టర్‌ను అరెస్ట్‌కు ౨ వారాలుగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్‌ను ఉపయోగించి బంకర్ లోపల పాస్టర్ దాక్కున్నట్లు పోలీసులు గుర్తి ంచారు. దీంతో ఆదివారం రాత్రి లొంగిపోయాడు. ఈ సందర్భంగా పాస్టర్ మాట్లాడు తూ తన అరెస్ట్ వెనక దెయ్యం ఉందని పేర్కొన్నాడు. 2021లో అమెరికా న్యాయశాఖ పాస్టర్ అపోలోపై పిల్లలను సెక్స్ రాకెట్‌లోకి దింపడం, మోసం, క్యాష్ స్మగ్లింగ్ తదితర కేసులను నమోదు చేసింది. అలాగే ఫిలిప్పీన్స్ నుంచి అమెరికాకు బాలికలు, మహిళలను పంపుతున్నట్లు ఎఫ్‌బీఐ ఆరోపించింది.