calender_icon.png 23 September, 2024 | 2:41 PM

క్రిమినల్ కేసులుంటే పాస్‌పోర్టు తిరస్కరించొచ్చు

25-07-2024 01:58:18 AM

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): ఒక వ్యక్తిపై క్రిమినల్ కేసులున్నపుడు అతని పాస్‌పోర్టును తిరస్కరించవచ్చని, క్రిమినల్ కేసులతో సంబంధం లేకుండా పాస్‌పోర్టును రెన్యూవల్ చేయమంటూ ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. క్రిమినల్ కేసులు ఉన్నపుడు పాస్‌పోర్టును తిరస్కరించే అధికారం పాస్‌పోర్టు అథారిటీకి చట్టం కల్పిం చిందని హైకోర్టు తేల్చిచెప్పింది. చట్టానికి విరుద్ధంగా పాస్‌పోర్టు జారీ చేయాలంటూ సింగిల్ జడ్జి ఆదేశాలు చెల్లవని పేర్కొంది. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలానికి చెందిన అనంతరాజు గౌడ్‌కు పాస్‌పోర్ట్ తిరస్కరణపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు.

దీనిపై విచారించిన సింగిల్ జడ్జి కింది కోర్టులో ఉన్న క్రిమినల్ కేసులతో అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా 10 ఏళ్లకు పాస్పో ర్టును రెన్యూవల్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ కేంద్ర విదేశాంగశాఖ, హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం హైకోర్టులో అప్పీలు దాఖలు చేశాయి. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరాజుగౌడ్ నల్లగొండ కోర్టును ఆశ్రయించి కేసును సత్వ రం పరిష్కరించాలని కోరవచ్చని సూచించింది. దీన్ని పరిగణనలోకి తీసుకుని కేసును తేల్చాలని కింది కోర్టుకు ఆదేశాలు జారీ చేస్తూ అప్పీలుపై విచారణను ముగించింది.