ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి జే స్నేహజ
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): పాస్‌పోర్ట్ జారీ చేసేందుకు అపాయింట్‌మెంట్ కాలపరిమితిని 5 నుంచి 7 పనిదినాలకు తగ్గించనున్నట్టు రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ జే స్నేహజ తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మా ట్లాడుతూ..
దరఖాస్తులను పరిశీలించడానికి రానున్న రోజుల్లో టోలీ చౌక్, అమీర్‌పేట్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను మెరుగైనా ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు.2024లో 9.02 లక్షల దరఖాస్తులను పరిశీలించినట్టు వివరించారు.
తత్కాల్ పాస్‌పోర్టులు కేవలం 1 నుంచి 3 పనిదినాల్లో జారీ చేస్తున్నట్టు తెలిపారు. సాధారణ పాస్‌పోర్ట్‌లకు పోలీసు వెరిఫికేషన్ సమయం మినహా, 5 నుంచి 7 పనిదినాల సమయం పడుతోందని చెప్పా రు. భారత రాజ్యాంగం 75 ఏండ్ల మైలురాయిని పురస్కరించుకుని ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.