calender_icon.png 12 April, 2025 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ విలేకరుల పాసులు జారీ చేస్తాం

04-04-2025 09:04:30 PM

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

భద్రాచలం,(విజయ క్రాంతి): భద్రాచలం జరిగే సీతారాముల కళ్యాణం పట్టాభిషేకంకు హాజరయ్యే విలేకరులకు జిల్లా యంత్రాంగం పాసులు జారీ చేస్తుందని, దీనిపై ఎటువంటి భయాందోళన చెందాల్సిన పనిలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శుక్రవారం భద్రాచలంలోని విజయ క్రాంతి రిపోర్టర్ తో ఫోన్లో మాట్లాడుతూ... ఎంతోకాలంగా విలేకరులు రాముడి సేవలో ఉంటూ భద్రాద్రి అభివృద్ధికి కృషి చేస్తున్నారని వారికి ఏడాది కూడా గతంలో ఏ విధంగా శ్రీరామనవమి పాసులు జారీ చేశారు అదే విధంగా ఈ ఏడాది కూడా సమాచార శాఖ ద్వారా విలేకరులకు పాసులు పంపిణీ చేస్తారని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ను ఆదేశించినట్లు కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  తెలిపారు. శ్రీరామనవమి ఉత్సవానికి విలేకరులకు పాసులు పంపిణీ చేస్తామని మంత్రి తుమ్మల తెలియజేయడంతో భద్రాచలంలోని విలేకరులు విలేకరుల సంఘాలు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.