నారాయణపేట, జనవరి 13(విజయ క్రాంతి): ప్రయాణికులు ఒక చోట నుండి మరోచోటికి ప్రయాణించేటప్పుడు అప్రమ త్తంగా ఉండాలని ఏఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా బస్టాండ్లలో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రయాణికులను, అనుమానిత వ్యక్తులను ఫింగర్ ప్రింట్స్ డివైస్ తో అకస్మికంగా తని ఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.
బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు బ్యాగులు, విలువైన బంగారు వస్తువులు, సెల్ ఫోన్లు జాగ్రత్తగా చూసుకోవాలని ప్రయాణించే టప్పుడు కొత్త వ్యక్తులు మాటలు కలిపి ఏమ ర్చి దొంగతనాలకు పాల్పడుతున్నారని అ లాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని మరియు ఎవరైనా తినిబండారాలు ఇస్తే తీసుకోరాదని నారాయణపేట పోలీసులు ప్రయాణికులకు సూచించారు. ప్రజల అప్ర మత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకో వాలని అత్యవసర సమయంలో డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని కోరారు.