స్పీడ్ బ్రేకర్లను గమనించకుండా హైస్పీడ్ ప్రయాణం
ప్రయాణికులకు తీవ్రగాయాలు
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): స్పీడ్ బ్రేకర్లను గమనించకుండా ఆర్టీసీ బస్సు డ్రైవర్ అతివేగంతో నడపడంతో బస్సుల ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెద్దపెద్ద పల్లి మండలం చంద్రకళ గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకోగా గాయపడిన వారిని జనరల్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ డిపో చెందిన ఆర్టీసీ బస్సు కొల్లాపూర్ నుంచి హైదరాబాద్ నాగర్ కర్నూల్ మీదుగా వెళ్తోంది. క్రమంలో కొల్లాపూర్ పెద్ద కొత్తపల్లి తదితర గ్రామాలకు చెందినవారు నాగర్ కర్నూల్ హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్తున్నారు.
ఈ క్రమంలో బస్సు డ్రైవర్ అజాగ్రత్త అతివేగంతో నడుపుతూ స్పీడ్ బ్రేకర్లు ఉన్నచోట కూడా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ముందు కూర్చున్న కుర్చీలతో పాటు బాగా కుదిపేయడంతో మోకాలు, తల, మోచేతి భాగాలతోపాటు ఎదలపై బలంగా గాయాలయ్యాయి. దీంతో కండక్టర్ బస్సు డ్రైవర్ తో ప్రయాణికులు గొడవలు దిగారు అనంతరం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించి ప్రయాణికులకు చికిత్స అందించారు. సుమారు 72 మంది ప్రయాణిస్తుండగా అందులో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.