calender_icon.png 7 March, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ నిర్లక్ష్యం.. ప్రయాణికులకు పాట్లు

06-03-2025 10:42:55 PM

అధికారుల తీరుపై కార్మికులకు, ప్రజలకు తప్పని ఇబ్బందులు...

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. అసిఫాబాద్ నుండి మియాపూర్ వెళ్లాల్సిన సూపర్ లగ్జరీ (8070) సర్వీస్ 50 నిమిషాలు ఆలస్యంగా ప్లాట్ఫామ్ పైకి రావడంతో గంటసేపు ప్రయాణికులు డిపో వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్లను తప్పనిసరిగా టీమ్స్ తీసుకువెళ్లాలని డిఎం విశ్వనాథ్ ఒత్తిడి చేయడంతో డ్రైవర్లు నిరాకరిస్తున్నారు. దీంతో స్టేజి వద్ద కండక్టర్ను ఏర్పాటు చేసి టికెట్లు ఇష్యూ చేయడం దారుణంగా ఉందని ప్రనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేజి దాటి ముందుకు వెళ్లి ప్రయాణికుడు బస్సు ఎక్కి పరిస్థితి లేదు. ప్రతి బస్సుకు కండక్టర్ కేటాయించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రవాణా సౌకర్యం కల్పించాల్సిన ఆర్టీసి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.