calender_icon.png 12 February, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సులపై ప్రయాణికుల ఆవేదన

11-02-2025 10:34:39 PM

నిజాంసాగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావు పల్లి వద్ద పిట్లం నిజాంసాగర్ ఎక్స్ రోడ్డులో డేగ్లూర్, బిచ్కుంద వైపు నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు చౌరస్తాలో ఫ్లెఓవర్ క్రింది నుంచి వెళ్తూ స్టాప్ దగ్గర ఆగకుండా ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్లడం వలన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలుమార్లు అధికారులకు ఈ విషయంపై విన్నపించిన ఫలితం లేకుండాపోయిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు వేడుకుంటున్నారు.