06-03-2025 12:18:53 AM
శంషాబాద్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
రాజేంద్రనగర్, మార్చి 5: శంషాబాద్ అంతర్జాతీయ విమానా బుధవారం ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. దోహా నుంచి బంగ్లాదేశ్ వెళ్తున్న విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలికి గుండెపోటు రావడంతో ఏటీసీ అనుమతి తీసుకొని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. సదరు మహిళను శంషాబాద్ విమానాశ్రయంలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది.