హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4(విజయక్రాంతి): మెట్రో రైల్ సెన్సార్ పనిచే మెట్రోరైల్ డోర్‌లో ఓ ప్రయాణికుడు ఇరుక్కున్న సంఘటన ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌లో చోటుచేసుకుంది. శనివారం ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు రైలు దిగుతుండగా సెన్సార్ పనిచేయకపోవంతో డోర్లు అకస్మాత్తుగా మూసుకోవడంతో ఆ ప్రయాణికుడు డోర్ల మధ్య ఇరుక్కున్నాడు.
గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే అతడిని లోపలికి లాగడంతో ప్రాణాపాయం తప్పింది. సెన్సా వ్యవస్థ పనిచేయకపోవడంతోనే ఘటన జరిగిందని మెట్రో నిర్వాహకులు తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని పేర్కొన్నారు.