calender_icon.png 4 October, 2024 | 2:54 AM

ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం

04-10-2024 12:52:30 AM

మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి

హైదరాబాద్‌సిటీబ్యూరో, అక్టోబర్3 (విజయక్రాంతి): ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్ంయ ఇస్తామని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీ ఎస్‌రెడ్డి, ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఎండీ కేవీబీరెడ్డి అన్నారు. గురువారం నగరంలో ఆ సంస్థ తొలి భద్రత సెమినార్‌ను నిర్వహించారు. హెచ్‌ఎంఆర్‌ఎల్, ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్, కిలియోస్ హైదరాబాద్ ఉన్నతాధికారులు, భద్రతా నిఫుణులు, సిబ్బంది సమక్షంలో ప్రదర్శించిన భద్రతా పద్ధతులను వారు పరిశీలించారు.

అనంతరం సేఫ్టీ పాకెట్ డైరీని ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఎన్వీఎస్‌రెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వహణలో భద్రతా ప్రాధాన్యతను వివరించారు. హైదరాబాద్ మెట్రో నిర్మాణ సమయంలో  జీరోరీ రికార్డును సాధించడంతో పాటు అనేక భద్రతా అవార్డులను అందుకున్నట్లు తెలిపారు.

నిరంతరం అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని చెప్పారు. కేవీబీరెడ్డి మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రత విషయంలో హైదరాబాద్ మెట్రో తిరుగులేని నిబద్ధతను చాటుకుంటోందన్నారు. మెరుగైన రీతిలో మెట్రో వ్యవస్థ కొనసాగుతోందన్నారు.