20-03-2025 10:32:46 PM
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి..
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల ఎస్సీ వర్గీకరణ బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లులను చట్టసభలో ఆమోదించడం చారిత్రాత్మక విషయమని, మండల కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లులను చట్టసభలో ఆమోదించడం చారిత్రాత్మక విషయమని, దేశ చరిత్రలోనే ఇలాంటి బిల్లును చట్టబద్ధత చేసింది తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర భారీ నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తంకుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.
ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ సబ్ కమిటీలకు చైర్మన్గా వ్యవహరించి ఈ రెండిటిని చట్టాలలో అమలయ్యే విధంగా ప్రత్యేక కృషిచేసిన రాష్ట్ర భారీ నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తంకుమార్ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఈ రెండు బిల్లులను చట్టసభలో ఆమోదం చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదేవిధంగా పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తంకుమార్ రెడ్డికి స్థానిక శాసన సభ్యురాలు ఉత్తం పద్మావతి రెడ్డికి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కొలిశెట్టి బుచ్చి పాపయ్య, మార్కెట్ డైరెక్టర్, కోటేశ్వరరావు, మండల ఉపాధ్యక్షులు మట్టయ్య సామేలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయి, పనస విజయ్, కొమ్ము ఈదా రావు, బేతం రామిరెడ్డి, చింతకాయల నాగరాజు, మండవ శ్రీను, పసుపులేటి గోపి, షేక్ నాగుల్ పాషా, కోటేశ్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.