calender_icon.png 23 April, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజామాబాద్ జిల్లాలో ఉత్తీర్ణత 59.25 శాతం

23-04-2025 12:13:32 AM

  1. రెండవ సంవత్సరంలో బాలికలు 70% బాలురు 45% ఉత్తీర్ణత

ఫలితాల్లో బాలికలదే పై చేయి ఇంటర్ విద్యాశాఖ అధికారి రవికుమార్ 

నిజామాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ఈ సారి విద్యా సంవత్సర వార్షిక పరీక్షల కు హాజరైన ఇంటర్మీడియట్ విద్యార్థులు 59. 25% శాతం ఉత్తీర్ణత సాధించారు. మంగళవారం వెలువడిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో మొదటి సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థులు 53.37% ఉత్తీర్ణత సాధించారనీ ఇంటర్మీడియట్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు.

బాలికల ఉత్తీర్ణత శాతం అధికంగా ఉండడంతో బాలికలదే ఇంటర్మీడియట్ తీర్ణతలో పై చేయి గా నిలిచింది. మొత్తం బాలికలు రెండవ సంవత్సరంలో 70% మంది విద్యార్థినిలు తీర్ణనులు కాగా బాలురు, 45 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరంలో బాలికలు 64% ఉత్తీర్ణత సాధించగా బాలురు 41 శాతం ఉత్తీర్ణత సాధించారు.

నిజామాబాద్ జిల్లాలో రెండవ సంవత్సరం జనరల్ కోర్సులలో 13, 945 మంది విద్యార్థులు హాజరు కాగా వీరిలో 8, 1 17 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు వీరిలో విద్యార్థినిలు 7,657 మంది హాజరు కాగా 5,309 మంది విద్యార్థినిలు ఉత్తీర్ణులయ్యారు. బాలురు 6,288 మంది పరీక్షలకు హాజరు కాగా 2,808 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఒకేషనల్ లో మొత్తం 2,042 మంది విద్యార్థులు హాజరు కాగా 1,231 అంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

వీరిలో బాలికలు 814 మంది పరీక్షలకు హాజరు కాగా 66 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలురు 1,228 మంది పరీక్షలకు హాజరు కాగా 565 మంది ఉత్తీర్ణులు అయ్యారు. మొదటి సంవత్సరం జర్నల్ కోర్సులలో విద్యార్థులు మొత్తం 15,056 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 8, 035 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు వీరిలో బాలికలు 8,074 మంది హాజరు కాగా 5,191 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

బాలురూ 6,982 మంది పరీక్షలకు హాజరు కాగా 2,844 మందివి ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు 2,790 మంది పరీక్షకు హాజరు కాగా 1,223 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 1,111 మంది హాజరు కాగా వీరిలో 756 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు l.679 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 467 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.