న్యూఢిల్లీ: వరల్డ్ యునివర్సిటీ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ షూటర్ భవ్‌తేగ్ సింగ్ స్వర్ణంతో మెరిశాడు. జూనియర్ విభాగంలో మంగళవారం జరిగిన స్కీట్ షూటింగ్ ఫైనల్లో 58 పాయింట్లు స్కోరు చేసిన భవ్‌తేగ్ టాప్ స్థానంలో నిలిచి పసిడి దక్కించుకోగా.. అభమ్ సింగ్ కాం స్యం గెలిచాడు.. మహిళల విభాగం నుంచి మరో రెండు కాంస్యాలు వచ్చి చేరాయి. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో సిమ్రన్‌ప్రీత్ కౌర్, మహిళల స్కీట్ విభాగంలో యశస్వి రాథోర్ పతకాలు సాధించారు. టోర్నీలో ఇప్పటివరకు భారత్ 2 స్వర్ణాలు సహా 13 పతకాలు సాధించింది.