23-03-2025 12:13:50 PM
హైదరాబాద్: గాంధేయవాది(Gandhian), భారత స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబానికి చెందిన పసల కృష్ణభారతి(Krishna Bharathi Passes Away) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె వయసు 92 సంవత్సరాలు. హైదరాబాద్ స్నేహపురి కాలనీలోని స్వగృహంలో పసల కృష్ణభారతి తుదిశ్వాస విడిచారు. కృష్ణభారతి పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari District)కు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు(Freedom fighters) పసల కృష్ణమూర్తి- అంజలక్ష్మి దంపతుల రెండో కుమారై. జీవితాంతం గాంధేయవాదిగా ఉంటూ, గాంధీ విలువలతోనే పలు విద్యాసంస్థలకు నిధులు అందజేశారు. కృష్ణభారతికి నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్లు.. 2022 జులైలో భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాని మోదీ(PM Narendra Modi) కృష్ణభారతిని సత్కరించి ఆమెకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.