calender_icon.png 9 January, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజ్రీవాల్‌పై పోటీగా పర్వేశ్ వర్మ

05-01-2025 02:09:20 AM

న్యూఢిల్లీ జనవరి ౪: దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తుండగా, తాజాగా బీజేపీ 29 మందితో తన తొలి జాబితాను విడుదల చేసింది. ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్‌పై పోటీగా మాజీ ఎంపీ పర్వేశ్ వర్మ పేరును ఖరారు చేసింది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో నిలువనున్నారు.

కాగా ఇప్పటికే కాంగ్రెస్ కూడా ఈ స్థానానికి మాజీ సీఎం షీలాదీక్షిత్ కొడుకు సందీప్ దీక్షిత్ పేరును ఖరారు చేసింది. ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే పర్వేశ్ వర్మ. ఇతడు 2014 నుంచి 2024 వరకు పశ్చిమ్ ఢిల్లీ సెగ్మెంట్ నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 5.78 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

ఢిల్లీ చరిత్రలో ఇదే అతిపెద్ద రికార్డు విజయం. కల్కాజీ నియోజకవర్గంలో బరిలో నిలిచిన ప్రస్తుత సీఎం ఆతిశీకి పోటీగా మరో మాజీ ఎంపీ రమేశ్ బిదూడీని బీజేపీ నిలబెట్టింది. తాజాగా ఆప్ నుంచి బీజేపీలో చేరిన మాజీమంత్రి కైలాశ్ గహ్లోత్ బిజ్వాసన్ టికెట్ దక్కించుకున్నారు.

ఢిల్లీ కాంగ్రెస్ మాజీ చీఫ్ అరవింద్ సింగ్లీ లవ్లీ కూడా కమళదళంలో చేరగా.. అతడికి గాంధీనగర్ స్థానం ఖరారైంది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరితో అసెంబ్లీ గడువు ముగియనుంది. మరికొన్ని రోజుల్లో ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది.