calender_icon.png 23 October, 2024 | 4:55 AM

ఏసీబీకి పట్టుబడిన పర్వతగిరి ఎస్సై

03-08-2024 03:03:33 AM

రూ.40 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన వైనం

హనుమకొండ, ఆగస్టు 2 (విజయక్రాంతి): లంచం తీసుకుంటూ వరంగల్ జిల్లా పర్వతగిరి ఎస్సై గుగులోత్ వెంకన్న ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం.. పర్వతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చేపట్టిన వాహనాల తనిఖీల్లో అన్నారం పెద్దతండాకు చెందిన చిరు వ్యాపారి బాదావత్ భాస్కర్ బెల్లం రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. శుక్రవారం ఉదయం స్టేషన్ బెయిల్ పొందేందుకు వెళ్లాడు.

బెయిల్ ఇచ్చేందుకు ఎస్సై వెంకన్న రూ.70వేలు డిమాండ్ చేశారు. అంగీకరించిన బాధితుడు ముందుగా రూ.20వేలు ఓ వ్యక్తి ద్వారా ఫోన్ పే చేశాడు. అనంతరం భాస్కర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం పోలీస్‌స్టేషన్ ఆవరణలో కానిస్టేబుల్ సదానందంకు రూ.40 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎస్సై ఆదేశాల మేరకు లంచం తీసుకున్నట్లు కానిస్టేబుల్ తెలిపాడు. ఎస్సై వెంకన్నతో పాటు కానిస్టేబుల్ సదానందంను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు.