03-03-2025 11:22:35 PM
హయత్నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి...
ఎల్బీనగర్: పక్కా ప్రణాళికతో హయత్ నగర్ డివిజన్లోని పర్వత్నగర్ సమస్యలు పరిష్కరిస్తానని కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన పర్వత్ నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ కాలనీలో మౌలిక సదుపాయాలు ఉన్నాయని కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, తాగునీటి పైప్ లైన్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని సమస్యలు ఏకరువు పెట్టారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ.. సంబంధిత అధికారులతో మాట్లాడి కాలనీలోనీ సమస్యలన్నిటిని ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు మల్లారెడ్డి, నాగేశ్వరరావు, గోవర్ధన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సుబ్బారావు కాలనీవాసులు పాల్గొన్నారు.
హిందూ శ్మశాన వాటిక పనులు పరిశీలన...
డివిజన్లోని బంజారా కాలనీలో దాదాపు రూ.2 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న హిందూ స్మశాన వాటిక అభివృద్ధి పనులను సూపరిండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) నిత్యానంద్తో కలిసి కార్పొరేటర్ నవజీవన్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ... స్మశాన వాటికలో గ్రీనరీ, పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిచేందుకు మరికొన్ని నిధులను మంజూరు చేయాల్సిందిగా ఎస్ఈ ని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ దామోదర్, ఏఈ హేము నాయక్, వర్క్ ఇన్స్పెక్టర్ సురేశ్, బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ బండారి భాస్కర్, డివిజన్ అధ్యక్షుడు గంగాని శ్రీను తదితరులు పాల్గొన్నారు.