calender_icon.png 20 November, 2024 | 6:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహా ఎన్నికల్లో పరుందోలి ఓటర్లు

20-11-2024 03:14:27 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో కుమ్రం భీం జిల్లా కేరమేరి మండలంలోని పరంధోలీ, తాండ కోట, శంకర్ లొద్ది, గౌరీ, లేండిజాల, ముఖదంగూడా, బోలాపటార్, లేండి గూడా, అంతాపూర్, నారాయణగూడ, ఏసాపూర్, పద్మవతి, ఇందిరానగర్ గ్రామాలు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉండడంతో ఇక్కడి ప్రజలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో పాల్గొనడం విశేషం. సుమారు 3 వేల మంది చంద్రపూర్ జిల్లా రాజుర నియోజకవర్గలో ఓటును వినియోగించుకున్నారు. ఈ గ్రామ ప్రజలు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లోను తెలంగాణలో ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు మహారాష్ట్రలో జరిగే ఎన్నికల్లోను ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సరిహద్దు ప్రాంతంలో గ్రామాలు ఉండడంతో ఇక్కడి ప్రజలకు ఇరు రాష్ట్రాలకు చెందిన ఓటర్ జాబితాలో ఓటు నమోదు కావడంతో రెండు రాష్ట్రాల ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.