calender_icon.png 13 October, 2024 | 6:30 PM

పార్టీ పటిష్టతకే ప్రాధాన్యతనివ్వాలి.. స్వార్థ రాజకీయాలు వద్దు

13-10-2024 04:18:08 PM

రాజకీయంలో రెచ్చగొట్టే విధానాలు మంచివి కావు

అందరినీ కలుపుకొనిపోతా పార్టీ కోసం పాటు పడ్డ వారికి పదవులు గ్యారంటీ

రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

కామారెడ్డి (విజయక్రాంతి): స్వార్థ రాజకీయాలను విడనాడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం బాన్సువాడలో పోచారం కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన పలువురు నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎవరిని కూడా తప్పుడు విమర్శలు చేయలేదని ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలి తప్ప బురదజల్లే రాజకీయాలు చేయవద్దని ఇతవు పలికారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పని చేసిన వారిని గుర్తించి మార్కెట్ కమిటీ పదవులను కట్టబెట్టుతూన్నట్లు తెలిపారు.

పార్టీని ప్రతిష్టవంతం చేసి దానికి కృషి చేయాలి తప్ప ఒకరు పై ఒకరు ఆరోపణలు చేయించడం తమ స్వార్థ రాజకీయాల కోసం బలి పశువులను చేయవద్దని అన్నారు. తనపై పోటీ చేసి ఓటమిపాలైన ఏనాడు కూడా కాసుల బాలరాజు తనను కించపరచలేదని తాను అతనిని కించపరచలేదని అన్నారు. నేడు ఇద్దరం ఒకే పార్టీలోకి రావడం వల్ల పార్టీష్టత కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల తనపై పోటీ చేసిన ఓ తమ్ముడు కలిసి పని చేయడానికి రావాలి కాని కొంతమందిని పెట్టుకుని వారి ద్వారా ఆరోపణలు చేయించడం రాజకీయ నాయకుని లక్షణం కాదని అన్నారు. ఒకే పార్టీలో ఉండి విమర్శించుకోవడం మంచి రాజకీయ వ్యక్తి లక్షణం కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో గత 40 సంవత్సరాలుగా ఉండి పనిచేసిన కోటగిరి వర్ని మార్కెట్ కమిటీ పదవులను కార్యకర్తల సూచనల మేరకు అప్పగించినట్లు తెలిపారు. రాజకీయ వైశ్యామ్యాలు పెట్టుకోవద్దని సూచించారు.

తనతో పార్టీలోకి వేలమంది నాయకులు కార్యకర్తలు వచ్చారని వారి కంటే ముందుగా కాంగ్రెస్ లో పనిచేసి వారిని గుర్తించి వారికి పదవులను ఇస్తున్నట్లు తెలిపారు. తన 40 ఏళ్ల రాజకీయం జీవితంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా బాన్సువాడ ప్రజలు ఆదరించారని వారి అభివృద్ధి తన లక్ష్యం అని పోచారం అన్నారు. అందరం కలిసి బాన్సువాడ అభివృద్ధితోపాటు కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కృషి చేద్దామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డిసిపి బి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి నాయకులు కృష్ణారెడ్డి, అంజిరెడ్డి ,గురు వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.