calender_icon.png 9 January, 2025 | 4:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలోనే పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ

09-01-2025 01:26:15 AM

  1. పార్టీ కోసం పని చేసేవారికి సముచిత స్థానం 
  2. మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడి 
  3. మూడు నెలలకోసారి రాష్ట్రానికి వేణుగోపాల్ రావాలని కోరాం 
  4. పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు 

కులగణనపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేసీ వేణుగోపాల్ అభినందించారని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పీఏసీ సమావేశం అనంతరం పీసీసీ మాజీ అధ్యక్షులు వీ  హనుమంతరావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీతో కలి సి మంత్రి మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు ఇవ్వాలని, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారని అన్నా రు.

త్వరలోనే పార్టీ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులను భర్తీ చేస్తామని, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి చెప్పారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. మహాత్మగాంధీ ఆలోచనలను కొత్త తరానికి తెలియజేయడానికి జనవరి 2025 నుంచి ఏడాది కాలం పాటు కార్యక్రమాలతో ముందుకు వెళ్లుతామన్నారు.

ఎన్నికలో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుందని, జనవరి 26 నుంచి రైతు భరోసా పథకం అమలు చేస్తామని తెలిపారు. ఒక సంవత్సరంలోనే రైతుల కోసం ప్రభుత్వం రూ. 50 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. పీసీసీ మాజీ అధ్యక్షులు వీ హనుమంతరావు మాట్లాడుతూ.. మూడు నెలలకోసారి రాష్ట్రానికి రావాలని కేసీ వేణుగోపాల్‌ను కోరినట్లు చెప్పారు.

అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట కోసం కవిత మాట్లాడటం లేదని, కానీ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం బతకమ్మ కుంట కోసం పోరాటం చేశారని తెలిపారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇంకా ప్రజలకు దగ్గరకు కావాలని కేసీ వేణుగోపాల్ సూచించారన్నారు.

నెలకోసారి ప్రతి మంత్రి జిల్లాలో ప్రజాదర్బార్ నిర్వహించాలని చెప్పారన్నారు. నెలకోసారి పీఏసీ సమావేశం నిర్వహించాలన్నారు. కొత్త పీఏసీ ఏర్పాటయ్యే వరకు పాత కమిటీనే కొనసాగుతుందన్నారు. అంబేద్కర్‌పై అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను ఖండించినట్లు చెప్పారు. ఈ నెలలోనే సంవిదాన్ బచావో ర్యాలీ ఉంటుందన్నారు.