05-04-2025 08:10:17 PM
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి..
కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): గ్రామ గ్రామాన పట్టణ కేంద్రాల్లో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం కామారెడ్డి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం రాజారెడ్డి గార్డెన్స్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి కామారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి హాజరై మాట్లాడారు. ఆదివారం ఏప్రిల్ 6 పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, వార్డుల్లో పార్టీ జెండా ఆవిష్కరణ చేయాలని సూచించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి నాయకుడు, కార్యకర్త తప్పక పోటీ చేయాలనీ అన్నారు. ప్రతి బీజేపీ కార్యకర్త ఇప్పటి నుండే ప్రజల్లో ఉంటూ పోటీకి సన్నద్ధం కావాలనీ సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థులు గెలుస్తారనీ ధీమా వ్యక్తం చేశారు, స్థానిక సంస్థల్లో గెలుపే పార్టీ బలాన్ని నిరూపిస్తుందనీ పేర్కొన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ పోటీ చేసి గెలిచి ప్రజలకు మరింత పారదర్శకమైన పాలన అందించాలని అన్నారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు విపుల్ జైన్ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, బిజెపి మహిళా అధ్యక్షురాలు అనిత, బాలమణి, మోహన్ రెడ్డి, పిల్లి మల్లేష్, నియోజకవర్గం లోని బిజెపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.