calender_icon.png 6 April, 2025 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లాటినం స్వచ్ఛత నిర్ధారణకు టీయూవీతో భాగస్వామ్యం

17-12-2024 01:56:11 AM

ప్రతీ ఆభరణంపై ప్రత్యేక గుర్తింపు సంఖ్య

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16 (విజయక్రాంతి): ప్లాటినం స్వచ్ఛతను నిర్ధారించేందుకు టీయూ వీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ప్లాటినం గిఫ్ట్ ఇంటర్నేషనల్(పీజీఐ) భాగస్వామ్యమైనట్టు ఆ సంస్థ ప్రతిని ధులు తెలిపారు. దేశంలో మొట్టమొదటి ధ్రువీకరణ సంస్థల్లో టీయూవీ ఒకటని,  భారతదేశంలోని నాణ్యత విప్లవంతో దగ్గరి సంబంధాలు కలిగి ఉం దని చెప్పారు.

పీజీఐ ఇండి యా నాణ్యత హామీ ప్రకారం ప్రతీ ఆభరణం 95శాతం వర కు స్వచ్ఛతను కలిగి ఉంటుందని, ఈ హామీకి రుజువుగా ప్రతీ ముక్కపై ‘పీటీ950’స్టాంప్ వేసి ఉంటుందన్నారు. ఇతర ఆభరణాల నుంచి ప్రామాణికమైన ప్లాటినంను వేరు చేసే ట్యాంపర్ ప్రూఫ్ నాణ్యత హామీ కార్డ్‌తో వస్తుందని చెప్పారు. వినియోగదారులు ఎంచుకున్న ఆభరణాలపై ప్రత్యేక గుర్తింపు సంఖ్య కూడా ముద్రించి ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు కొనుగోలు చేసే ప్లాటినం అత్యధిక నాణ్యతతో ఉంటుందని చెప్పారు.