calender_icon.png 28 March, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పార్టీలు వ్యవహరించాలి

21-03-2025 12:00:00 AM

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్

మహబూబాబాద్, మార్చి 20: (విజయక్రాంతి): ఎన్నిక ల నిబంధనలకు అనుగుణంగా రా జకీయ పార్టీలు వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అద్వై త్ కుమార్ సింగ్ అన్నారు. గురువా రం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతి నిధులతో జిల్లా ఎన్నికల అధికారి, క లెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కు మార్ సింగ్ ఎన్నికల అంశాలు, ఓట రు నమోదు కార్యక్రమం, మార్పు లు, చేర్పులు తదితర విషయాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం గతంలో తీసుకున్న చర్యలు ఓటరు నమోదు కార్యక్ర మం, మార్పులు చేర్పులు, బీల్‌ఏ, బి ఎల్‌ఓ పనితీరు,  కుటుంబ సభ్యులకు ఒకే చోట ఓట్ల వినియోగం, త దితర అంశాలపై ప్రతినిధుల సలహాలు సూచనలు తీసుకున్నారు. ప్ర భుత్వ, ఎన్నికల నిబంధనల ప్రకారం అన్ని చర్యలు తీసుకుటమనీ, వివరించారు.

ఈ సమావేశంలో జిల్లా ఉప ఎన్నికల అధికారి కె.వీర బ్రహ్మచారి, ఎన్నికల విభాగం పర్యవేక్షలు ఏఓ పవన్ కుమార్,రాజకీయ పార్టీల ప్రతినిధులు కాంగ్రెస్ సురేష్ నాయు డు, బిజెపి శ్యామ్ సుందర్ శర్మ, బిఆర్‌ఎస్ మర్నేని వెంకన్న, సిపిఐ నవీ న్, కుమార్, విజయ్ సారధి, తదితరులు పాల్గొన్నారు.