calender_icon.png 15 March, 2025 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాహిత్యంతో సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం

22-12-2024 01:13:06 AM

పుస్తకాల ఆవిష్కరణ సభలో ప్రసంగించిన వక్తలు 

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 21 (వియక్రాంతి): సాహిత్యాన్ని విభిన్న కోణాల్లో ఆవిష్కరించే సాహితీవేత్తలందరూ తమ సాహి త్యం ద్వారా నిరంతరం ప్రశ్నిస్తూ ఈ సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతుంటామని పలువురు వక్తలు అన్నారు. తెలంగాణ రచయితల సంఘం వరంగల్ జంట నగరాల శాఖ ల సంయుక్త నిర్వహణలో నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలో  శనివారం  ప్రముఖ కవయిత్రి నెల్లుట్ల రమాదేవి రచించిన అశ్రువర్ణం కవితా సంపుటి, రామాయణం కాలమ్స్ సంపుటిలను.. ప్రముఖ కవయిత్రి, రచయిత్రి కొండపల్లి నిహారిణి సంపాదకత్వంలో ప్రచురించిన సాహితీవేత్తల ఇంటర్వ్యూల సంకలనం మ యూఖ ముఖాముఖి 2 పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్ర మా నికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి, డాక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి, తెలుగు విశ్వ విద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ వెలుదండ నిత్యానంద రావు హాజరై మాట్లాడారు.  సమాజంలో చోటు చేసుకునే అనేక సంఘటనల నేపథ్యంలో గాయపడిన మనస్సుతో ఆవిష్కరించేదే సాహిత్యం అని అన్నారు. ఈ సాహిత్యాన్ని కొందరు కవిత్వం, కథలు, నవల, ఇతరత్రా కోణాల్లో ఆవిష్కరిస్తారన్నారు.

తెలంగాణ రచయితల సంఘం వరంగల్ అధ్యక్షులు పొట్లపల్లి శ్రీనివాస రావు, హైదరాబాద్ జంట నగరాల శాఖ అధ్యక్షులు కందుకూరి శ్రీరాములు, పుస్తక రచయిత్రులు కొండపల్లి నీహా రిణి, నెల్లుట్ల రమాదేవి, ప్రముఖ రచయిత్రి, విజయ్ విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు డాక్టర్ అమృతలత, ప్రముఖ రచయిత్రి, కవయిత్రి కిరణ్ బాల, ప్రముఖ కవయిత్రి, విమర్శకురాలు డాక్టర్ కొల్లాపురం విమల, ప్రముఖ ఫిల్మ్ మేకర్ వేణు నక్షత్రం, కేఎస్ అనంతచార్యులు, మాడిశెట్టి గోపాల్, అరుణ దూళిపాళ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కవులు, రచయితలను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.