ఆర్టీసీ జేఏసీ పిలుపు
హైదరాబాద్, జనవరి 29(విజయక్రాంతి): ఆర్టీసీ జేఏసీలో లేని కార్మిక సంఘాలు తమతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని జేఏసీ తరఫున చైర్మన్ ఈదురు వెంకన్న బుధవారం ప్రకటనలో పిలుపునిచ్చారు. సమ్మె నోటీసుకు ముందే పలు సంఘాలకు తాము లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.
ఇప్పటి వరకు ఆ సంఘాల నుంచి తమకు ఎ లాంటి స్పందన రాలేదన్నారు. అయి తే ఆర్టీసీ తీవ్రమైన సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జేఏసీతో కలి సి రావాలన్నారు. కాగా... సమ్మె నోటీ సు అంశంపై తమతో ఆర్టీసీ జేఏసీ సంప్రదించలేదని ఎస్‌డబ్ల్యూఎఫ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు ప్రకటనలో తెలిపారు.