ప్రైవేట్ పాఠశాలలకు ఎస్ఓ టు జి ఎం శ్యామ్ సుందర్ పిలుపు..
మణుగూరు (విజయక్రాంతి): సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని టీవీ కాలనీ భద్రాద్రి స్టేడియంలో నిర్వహించే రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో మండలంలోని ప్రైవేట్ పాఠశాలలు భాగస్వామ్యం కావాలని ఏరియా ఎస్ ఓటు జయం శ్యాంసుందర్ కోరారు. సోమవారం కార్యాలయ సమావేశ మందిరంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో ఆయా పాఠశాలల విద్యార్థులు తమ కళా ప్రదర్శనలను ఇవ్వాలని ఆకాంక్షించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పాఠశాల విద్యార్థులకు ఏరియా జయం దుర్గం రామచందర్ చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీజీఎం పర్సనల్ ఎస్ రమేష్, డీజిల్ సివిల్ వెంకటేశ్వర్లు పర్సనల్ అధికారులు రామేశ్వరరావు, సింగు శ్రీనివాస్, సెక్యూరిటీ అధికారి కె శ్రీనివాస్, ప్రైవేటు పాఠశాలల యాజమాన్య కమిటీ సభ్యులు యూసఫ్ షరీఫ్, ఎక్సలెంట్, మాంటిసోరి, రాధిక కాన్సెప్ట్ పాఠశాలల కరస్పాండెంట్లు తదితరులు పాల్గొన్నారు.