calender_icon.png 11 January, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానసికోల్లాసం కలిగించే క్రీడల్లో పాల్గొనాలి

11-01-2025 12:31:39 AM

రామగిరి, జనవరి 10: యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా, శారీరక ధృడత్వం, మానసికోల్లాసం కలిగించే క్రీడల్లో పాల్గొనలని కాంగ్రెస్ యువ నాయకుడు దుద్దుల శ్రీనుబాబు సూచించారు శుక్రవారం రామగిరి మండలంలోని రాణి రుద్రమదేవి స్టేడియంలో  మండల  కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అజాతశత్రువు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట మాజీ శాసనస భావతి  శ్రీపాద రావు  స్మారకార్థం మంథని డివిజన్ స్థాయి టికెట్ టోర్నమెంట్ ను మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు,

కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీను బాబు శుక్రవారం కాంగ్రెస్ నాయకులు, నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకా రులతో మాట్లాడుతూ యువత చెడు వ్యసనాల బారిన పడకుండా శారీరక ధృడ త్వం, మానసి కోల్లాసం కలిగించే క్రీడల్లో పాల్గొని, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ పోటీలలో పాల్గొని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు.

క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఓడినవారు కృంగిపో కుండా గెలుపు కోసం ప్రయత్నం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాదేవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్,  జిల్లా ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం, మండల అధ్యక్షులు రొడ్డ బాపన్న, మాజీ ఎంపీపీ దేవక్క కొమురయ్య గౌడ్, కాంగ్రెస్ నాయకులు ముస్యల శ్రీనివాస్ కాటన్ సత్యం, తదితరులు పాల్గొన్నారు.