రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
ఖైరతాబాద్ ఇందిరానగర్‌లో పర్యటన
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వచ్ఛత సాధ్యమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. శుక్రవారం ఖైరతాబాద్ ఇందిరానగర్ కాలనీలో జరిగిన ‘స్వచ్ఛ తా కీ భాగీదారి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాలనీలో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు.
అనం తరం కాలనీవాసులతో గవర్నర్ స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఆయన మాట్లాడుతూ.. ఆరు నెలల్లో కాలనీ రూపురేఖలు మారాలని, స్వచ్ఛతకు మారుపేరుగా ఉండాల న్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఉన్నత విద్యా మండలి ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. రాజ్‌భవన్, సెక్రటేరియట్‌కు దగ్గరగా ఉన్న ఇందిరానగర్ కాలనీని గవర్నర్ దత్తత తీసుకున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ అమ్రపాలి, స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి, జాయింట్ సెక్రటరీ భవానీ శంకర్, అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్, జోనల్ కమిషనర్ రవికిరణ్, శానిటేషన్ సిబ్బంది, ఎన్జీవోలు, కాలనీవాసులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.