06-02-2025 12:00:00 AM
తిమ్మాపూర్ ఫిబ్రవరి 5: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో గల జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్ కళాశాలలో వివిధ రంగాలలో నిర్వహించే ప్రోగ్రామ్లలో విద్యార్థులు పాల్గొని బహుమతులు గెలుపొందాలని కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు అన్నారు.
బుధవారం కళాశాల ప్రాంగణంలో ఇంటర్ కాలేజీ యేట్ స్పోర్ట్స్ మీట్, ఇన్నోవేషన్ టెక్నికల్ ఈవెంట్స్, రేడియన్స్ కల్చరల్ ఈవెంట్స్, పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 20 నుంచి 28 వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు.
మార్చి 1న కళాశాల వార్షికోత్సవ సందర్భంగా ముందస్తుగా ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు స్పోర్ట్స్ ఫియాష్టాలో భాగంగా విద్యార్థుల కోసం వివిధ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామన్నారు.
ఫిబ్రవరి 24, 25, తేదీల్లో ఇన్నో ఫెస్ట్, విద్యార్థుల స్టాల్స్ అమ్మకాలు నిర్వహిస్తారన్నారు. అనంతరం మార్చి 1న ఉత్సవ్ 20 25 వార్షిక దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు.