calender_icon.png 3 January, 2025 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలో భాగస్వాములు కండి

11-10-2024 09:35:37 PM

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): యువతకు ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలలో పాల్గొనేందుకు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డి జానకి తెలిపారు. శాంతి భద్రతలలో భాగంగా సమాజ రక్షణలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా పెట్టి, పోరాడి వీరమరణం పొందిన అమర పోలీసుల జ్ఞాపకార్థం అక్టోబర్ 21 రోజన జరుగనున్న పోలీస్ ఫ్లాగ్ డే  సందర్భంగా పోలీస్ సంబంధిత అంశం మీద ఫోటోగ్రఫీ మరియు షార్ట్ ఫిలిం తీయడానికి  జిల్లాలో ఆసక్తి గల యువత ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు ముందుకు రావాలని  జిల్లా  ఎస్పీ డి.జానకి ఐపీఎస్ తెలిపారు.

ఇందులో భాగంగా...

1. పోలీసుల త్యాగాలు

2. విధుల్లో కనబరుస్తున్న తెగువ

3. మూఢనమ్మకాలు ఇతర సామాజిక రుగ్మతలు 

4. అత్యవసర సమయంలో పోలీసుల స్పందన

5. ప్రకృతి వైపరీత్యాల్లో పోలీసుల సేవ

6. సైబర్ నేరాలు నివారణ

7. ఈవ్ టీజింగ్-she టీమ్స్

8. మత్తు పదార్థాలు వాడకం వల్ల  అనర్థాలు

తెలిపిన వాటిపై తీసిన (3) ఫోటోలు, తక్కువ వీడియో (3 నిమిషాలు) గల షార్ట్ ఫిల్మ్ తీసి ఈ నెల 20న సాయంత్రం వరకు మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో, డీఎస్పీ మహబూబ్ నగర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఇట్టి షార్ట్ ఫిలిం 3 నిమిషాలు మించకూడదు, 10x8 సైజ్ ఫోటోలను, షార్ట్ ఫిలింను సిడిలో లేదా పెన్ డ్రైవ్ లో మీ యెక్క పూర్తి వివరాలతో  తెలపాలన్నారు. జిల్లా స్థాయిలో ఎంపిక అయిన మూడు షార్ట్ ఫిలింలను స్టేట్ కాంపిటేషన్ గురించి డీజీపీ  ఆఫీస్ హైదరాబాదుకు పంపించడం జరుగుతుందని పేర్కొన్నారు.