- కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్‌గాంధీ పిలుపు
- మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు, వరదలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ స్పందించారు. వరదల్లో మృతుల కుటుంబాలకు తన ప్రగఢ సానుభూతిని తెలిపారు. తెలుగు రాష్ట్రా ల్లో వరద సహాయక చర్యల్లో ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త పాల్గొనాలని రాహుల్ పిలుపునిచ్చా రు. ‘ఎడతెగని వర్షాలు, వినాశకర వరదలను భరిస్తున్న తెలంగాణ, ఏపీ ప్రజల పరిస్థితి గురించి నేను చింతిస్తున్నా. వరద ప్రాంతాల్లో సహాయ చర్యలకు మద్దతుగా అందుబాటులో ఉన్న అన్నీ వనరులను సమీకరించండి’ అని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను కోరారు. సంక్షోభాన్ని ఎదుర్కొవడంలో, పునర్మిర్మాణ చర్యల్లోనూ తెలంగాణ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందన్నారు.