calender_icon.png 28 April, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధీ విగ్రహానికి పార్ట్ టైం అధ్యాపకుల వినతి

28-04-2025 03:41:46 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణ పార్ట్ టైం అధ్యాపకులు ఏడవ రోజు సమ్మెలో భాగంగా సోమవారం తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, గాంధీ దృష్టిలో విద్య అనేది సమానత్వం సాధించడానికి ఒక సాధనమని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని గాంధీ అభిప్రాయపడ్డారు. 

విశ్వవిద్యాలయాలలో పనిచేసే అధ్యాపకుల విద్య దేశాభివృద్ధికి తోడ్పడుతుందనీ, అలాంటి విశ్వవిద్యాలయాలలో నేడు పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల జీవితాలకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని అన్నారు. తమకు ఇప్పటివరకు కనీస వేతనం కూడా లేదని అన్నారు. జి.ఓ 21 ని సవరించి తమ సర్వీసులను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇకనైనా పార్ట్ టైం అధ్యాపకుల న్యాయపరమైన డిమాండ్లను గుర్తించి తమకు న్యాయం చేయాలని అన్నారు. కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన పార్ట్ టైం అధ్యాపకులు పాల్గొన్నారు.