calender_icon.png 27 April, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు తిరిగి విధుల్లోకి తీసుకోవాలి

26-04-2025 05:34:28 PM

తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): విద్యాశాఖ సమగ్ర శిక్షలో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 2,300 మంది పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ (PTI) లను టర్మినేట్ చేసిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుండిగల్ యాదగిరి డిమాండ్ చేశారు. శనివారం పాల్వంచలో సిఆర్పి లతో కలిసి ఆయన మాట్లాడుతూ.... సమగ్ర శిక్షల పనిచేస్తున్న మిగిలిన వారందరినీ మూడు రోజుల టర్మినేట్ చేసి మళ్లీ విధుల్లోకి తీసుకోవడం జరిగిందని, పార్ట్ టైం ఇన్స్పెక్టర్ల విషయంలో మాత్రం వేసవి సెలవుల అనంతరం స్కూల్ ప్రారంభం నుంచి విధుల్లోకి తీసుకుంటాం అనే విధానం సరియైనది కాదన్నారు. 

2025 జనవరి 6వ తేదీన సమ్మె విరమణ ఒప్పందాలలో ఫు టీ ఐ లకు  12 నెలల వేతనం అమలు చేస్తాం అని ప్రభుత్వం హామీ ఇచ్చిందనీ, అదేవిధంగా ఇప్పటి వరకు సమ్మె కాలంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. సమ్మె కాలంలో వేతనం ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వకపోవడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బట్టు చందర్లాల్ , నాయకులు ప్రభాకర్, శ్రీనివాస్, కిషన్, గంగరాజు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.