స్టార్ హీరో సూర్య నటించిన ‘కంగువ’ చిత్రాన్ని పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా దర్శకుడు శివ తెరకెక్కించారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించారు. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలై, ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా శుక్రవా రం మీడియాతో ముచ్చటించారు.
‘-‘ఈ చిత్రంలో మేము ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాం. సిని మాను లైవ్ లొకేషన్స్‌తోపాటు సెట్స్ వేసి చేశాం. క్లుమైక్స్‌లో వచ్చే గెస్ట్ రోల్‌ను సర్ప్రైజ్ కోసం రివీల్ చేయలేదు. మేము అలా హైడ్ చేసి ఉంచడం వల్లే ఆడియెన్స్ థ్రిల్ అవుతున్నారు. బీజీఎం కొంత సౌండ్ ఎక్కువగా ఉందనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. అది థియేటర్లలో రెండు పాయింట్స్ తగ్గిస్తున్నాం.
లౌడ్ సౌండ్ టెక్నికల్‌గా జరిగిన మిస్టేక్ గానీ దేవి తప్పేమీ లేదు. పార్ట్2లో దీపికా పదుకోన్‌ను నాయికగా తీసుకుంటున్నామనే విషయంలో నిజం లేదు. ఇంకా ఆ మూవీ వర్క్స్ ప్రారంభించలేదు. డైరెక్టర్ శివకు అజిత్‌తో ఓ మూవీ చేయాల్సిన కమిట్మెంట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ అయ్యాక ‘కంగువ2’ వర్క్స్ ప్రారంభిస్తాం” అని చెప్పారు.