- అత్యాచారం కేసులో జైలుకెళ్లిన రామ్హ్రీమ్
- నాలుగేళ్లలో 9 సార్లకుపైగా పెరోల్ ఇచ్చిన కోర్టు
- ప్రభుత్వ తీరుపై వెల్లువెత్తుతోన్న నిరసనలు
న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఇద్దరు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న కేసులో దోషిగా తేలిన ‘డేరా సచ్చా సౌదా’ చీఫ్ గుర్మీత్ రామ్హ్రీమ్‌సింగ్ అలియాస్ డేరా బాబా.. తాజాగా మరోసారి పెరోల్ మీద జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆయనకు 21 రోజుల పాటు తాత్కాలిక బెయిల్ లభించడంతో మంగళవారం ఉద యం 6:30 గంటలకు జైలు నుంచి విడుదలైనట్లు అధికారులు తెలిపారు. ఈ 21 రోజులూ డేరా బాబా యూపీలోని డేరా ఆశ్రమంలోనే బస చేస్తార ని ఆయన అనుచరులు తెలిపారు. కాగా డేరాబాబాకు బెయిల్‌ను వ్యతిరేకిస్తూ శిరోమణి గురుద్వారా పర్బం ధక్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను పంజాబ్ హైకోర్టు ఇటీవల కొట్టేసిన విషయం తెలిసిందే. కేసు కొట్టేసిన కొన్ని రోజులకే డేరాబాబాకు పెరోల్ లభించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
అత్యాచారానికి పాల్పడ్డాడని..
2017లో తన ఆశ్రమంలోని ఇద్దరు శిష్యులపై అత్యాచారానికి పాల్పడ్డాడని డేరాబాబాపై కేసు నమో దు కాగా అదే ఏడాది అతడిని కోర్టు దోషిగా నిర్ధారణ చేసి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రెండు అత్యాచారాలకు సంబంధించిన కేసుల్లో దోషిగా శిక్ష అనుభవించడంతో పాటు పలు హత్య కేసుల్లోనూ జీవిత ఖైదు విధించింది కోర్టు. ప్రస్తుతం అతడు హర్యా నాలోని రోహ్‌తక్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే వివిధ కారణా లతో ఆయన ఇప్పటివరకు పలుమార్లు పెరోల్‌పై బయటకు వచ్చాడు.
గత నాలుగేళ్లలో డేరాబాబాకు మొత్తం గా తొమ్మిదిసార్లు పెరోల్ లభించింది. గతేడాది మూడుసార్లు పెరోల్ లభించగా మొత్తం కలిపి సంవత్సరంలో 91 రోజులపాటు బయటే ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో కూడా దాదాపు 50 రోజులపాటు పెరోల్‌పై బయటే ఉన్న డేరాబాబా మళ్లీ తాజాగా ఇప్పు డు పెరోల్ లభించడంతో 21 రోజులపాటు బయటే ఉండనున్నారు.