calender_icon.png 23 September, 2024 | 1:00 PM

పారో ఎయిర్‌పోర్ట్ యమా డేంజర్!

23-09-2024 02:22:08 AM

ల్యాండింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా 50 మంది పైలట్లే అర్హులు

థింఫూ, సెప్టెంబర్ 22: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర విమానాశ్రాయాల్లో ఒకటిగా భూటాన్‌లోని పారో ఎయిర్‌పోర్ట్ పేరుగాంచింది. దీనికి చుట్టూ 18,000 అడుగులు ఎత్తులో హిమాలయ పర్వతాలు ఉన్న నేపథ్యంలో ఎంతో నైపుణ్యం ఉన్న వారే ఇక్కడ విమానాన్ని ల్యాండ్ చేయగలరు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 50 మంది పైలట్లకు మాత్రమే ఈ అర్హత ఉంది. రన్‌వే పొడవు 7,431 అడుగులే ఉన్న నేపథ్యంలో చిన్న విమానాలను మాత్రమే ల్యాండ్ చేయొచ్చు. పైలట్ ఏ చిన్న తప్పు చేసినా విమానం ప్రమాదం బారిన పడుతుంది.

అందుకే ఈ విమానాశ్రయంలో ల్యాండింగ్ అర్హత పొందిన పైలట్లను డేర్‌డెవిల్స్‌తో పోలుస్తారు. ఇది సముద్రమట్టానికి 7,382 అడుగుల ఎత్తులో ఉంటుంది. వాతావరణ మార్పుల కారణంగా మధ్యాహ్నం వేల ఇక్కడ విమాన ప్రయాణాలను పైలట్లు వాయి దా వేస్తారు. వర్షాకాలంలోనైతే గోల్ఫ్‌బాల్ పరిమాణంలో వడగళ్లు పడతాయి. ‘పారోలో విమానం నడపాలంటే స్థానిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండాలి. దీన్ని మేం ఏరియా ట్రైనింగ్‌గా పిలుస్తాం’ అని స్థానిక డ్రూక్ ఎయిర్ పైలట్ చిమి దోర్జీ పేర్కొన్నారు.