calender_icon.png 29 December, 2024 | 5:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈనెల 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

05-11-2024 05:26:21 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలను ప్రకటించారు. ప్రస్తుతం అన్ని పార్టీలు మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఈనెల 23వ తేదీన వెల్లడికానున్నాయి.

ఆ తర్వతే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సంవిధాన్ సదన్ సెంట్రల్ హల్ ( పార్లమెంట్ పాత భవనం) ఇందుకు వేదిక కానుంది. ఈ సెషన్ లో భాగంగా 26వ తేదీన రాజ్యంగ దినోత్సావాన్ని నిర్వహిస్తామని మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. గత పార్లమెంట్ సమావేశాల్లో తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లును ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో ఈ బిల్లుపై విపక్షాలు తీవ్ర నిరసన తెలుపడంతో కేంద్రం సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపించిన విషయం తెలిసిందే.