calender_icon.png 31 January, 2025 | 7:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి పార్లమెంట్

31-01-2025 12:46:05 AM

  1. బడ్జెట్ సమావేశాలపై అఖిలపక్షంతో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ భేటీ
  2. ఈసారి వక్ఫ్ సవరణ బిల్లు సహా 16 బిల్లులు

న్యూఢిల్లీ, జనవరి 30: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించి సమావేశాలను ప్రారంభించను న్నారు. ఉభయ సభలూ రాష్ట్రపతి ప్రసంగంపై  చర్చించిన తర్వాత ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.

ఈ నేపథ్యంలో గురువారం కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, పలు పార్టీల ఎంపీలు హాజరవ్వగా.. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను కేంద్రం అఖిలపక్షానికి అందించింది.

బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బల్లు సహా మొత్తం 16 బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఇందులో బ్యాంకింగ్ చట్టాలకు సంబంధించిన సవరణ బిల్లు రైల్వే సవరణ బిల్లు 2024 వంటి కీలక బిల్లులు ఉన్నట్టు తెలుస్తుంది. కాగా బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి.

మొదటి విడుత సమావేశాలు శుక్రవారం ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు కొనసాగనున్నాయి. అలాగే మార్చి 10 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు రెండో విడుత సమావేశాలు జరగనున్నాయి.  ఆర్థిక  మంత్రి నిర్మలా సీతారామ న్ ౨౦ ౨౪-౨౫కు సంబంధించిన ఆర్థిక సర్వేను శుక్రవారం పార్లమెంట్ ముందు ప్రవేశపెట్ట నున్నారు.

వక్ఫ్ బిల్లుపై నివేదిక

వక్ఫ్ చట్టంలో మార్పుల పరిశీలన కోసం ఏర్పాటుచేసిన పార్లమెంటరీ సంయుక్త కమి టీ ఇటీవల సవరణ బిల్లును ఆమోదించింది. విపక్ష ఎంపీలు సహా ఇతరులు మొత్తంగా 44 మార్పులు సూచించగా 14 సవరణలను కమిటీ ఆమోదించింది. దానికి సంబంధించిన తుది నివేదికను సిద్ధం చేసి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందించింది.

వక్ఫ్ ఆస్తు ల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని కేంద్రం చెబుతోంది. అయితే ఈ సవరణలపై విపక్షాలు అసమ్మతి తెలిపాయి. ముస్లింలకు రాజ్యాంగపరంగా ఉన్న హక్కులపై దాడికే ఈ బిల్లును తెచ్చారని విపక్ష సభ్యులు ఆరోపించారు. 

ప్రశ్నించేందుకు విపక్షాలు రెడీ

మహాకుంభమేళా తొక్కిసలాట సహా దేశం ముందున్న ఆర్థిక సవాళ్లపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్ష నేతలు సిద్ధం అవుతున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ విప్ మాణికం ఠాకూర్ మాట్లాడుతూ కుంభమేళాలో తొక్కిసలాటను బీజేపీ ప్రభుత్వ వైఫల్యమని అభివ ర్ణించారు.

దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నట్టు స్పష్టం చేశారు. వ్యాపారవేత్త గౌతమ్ అదానీ పట్ల కేంద్ర ప్రభుత్వ పక్షపాతం, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ పట్ల బీజేపీ నిర్లక్ష్యం వంటి అంశాలపై నిలదీయనున్నట్టు రాహుల్ గాంధీ వెల్లడించారు.