10-03-2025 12:00:00 AM
వక్ఫ్ బిల్లు ఆమోదంపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ, మార్చి 9: రెండో విడుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 వరకు కొనసాగే ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఈ సెషన్‌లో ఎలాగైనా వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర పడేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
అలాగే మణిపూర్‌లో కొనసాగుతున్న రాష్ట్రపతి పాలనకు పార్లమెంట్ ఆమోదం కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఆ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.