calender_icon.png 31 January, 2025 | 2:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచే పార్లమెంట్ సమావేశాలు.. రేపే వార్షిక బడ్జెట్

31-01-2025 10:49:50 AM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Budget Sessions of Parliament) నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) ప్రసంగించి కేంద్రం పభుత్వ లక్ష్యాలు, సాధించిన ఫలితాలను వివరించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగించిన అనంతరం కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Union Finance Minister Nirmala Sitharaman) 2024-25 ఆర్థిక సర్వేను శనివారం సభలో ప్రవేశపెట్టనున్నారు. రేపు పార్లమెంట్ ముందు వార్షిక బడ్జెట్ లో ఈ సారి వక్ఫ్ సవరణ బిల్లు సహా 16 బిల్లులు  ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం వెల్లడించింది. వక్ఫ్ చట్ట సవరణ, ఇమ్మిగ్రేషన్, ఫారినర్ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగిన మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన, దేశంలో నిరుద్యోగం, రైతుల దుస్థితి అంశాలపై కాంగ్రెస్ పార్టీ చర్చకు పట్టుబడుతోంది. సమావేశాల అజెండాలను బీఏసీ నిర్ణయిస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి. నేటి నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత, మార్చి 10 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలను కేంద్రం నిర్వహించనుంది.