calender_icon.png 27 December, 2024 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

03-11-2024 02:49:16 AM

న్యూఢిల్లీ, నవంబర్ 2: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైం ది. నవంబర్ 25 నుంచి సమావేశాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశాలు డిసెంబర్ 20 వరకు జరిగే అవకాశం ఉంది. నవంబర్ 26న జాయింట్ పార్లమెంట్ సెషన్ ఉండనుంది. ఈ సామవేశాల్లో కీలక బిల్లులు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా వక్ఫ్ బిల్లును ఆమోదింప చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం.